ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'15 నుంచి ఏపీలో గాంధీజీ సంకల్పయాత్ర' - gandhi sankalp yatra in kadapa district

గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్​రెడ్డి తెలిపారు.

'అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర'

By

Published : Oct 14, 2019, 1:24 AM IST

'అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర'
గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా కడప జిల్లా జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి ప్రొద్దుటూరులో అన్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టగా మన రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 15న జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్ల‌దుర్తి గ్రామం నుంచి ఎంపీ సి.ఎం.రమేష్ నేతృత్వంలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభమవుతుందన్నారు. భాజపా జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీనాథ్ రెడ్డి చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details