కడప జిల్లా కోడికాండ్ల పల్లెని గండికోట జలాలు చుట్టుముడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. జలాశయంలో 26 టీఎంసీలకు ప్రభుత్వం అనుమతివ్వగా.. 23 టీఎంసీలకే గ్రామం ముంపునకు గురౌతోందని వాపోతున్నారు. పంట పొలాలు సైతం మునిగిపోతున్నాయని, తాగే నీళ్లు కూడా కలుషితమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్పించి పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
చుట్టుముడుతున్న గండికోట జలాలు.. ఆందోళనలో గ్రామస్థులు
గండికోట జలాలు ఆ గ్రామాన్ని చుట్టుముడుతున్నాయి. నెల రోజులుగా నెమ్మదినెమ్మదిగా గ్రామం చుట్టూ గండికోట జలాలు చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు మునిగిపోతున్నాయి, తాగేందుకు నీళ్లు లేవు, విద్యార్థులూ పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్పించి పరిహారం అందించాలని కడప జిల్లా కోడికాండ్ల పల్లె గ్రామ ప్రజలు కోరుతున్నారు.
చుట్టుముడుతున్న గండికోట జలాలు