కడప జిల్లా రాయచోటిలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో రైతులు పండించిన కూరగాయలను తీసుకొచ్చి రైతు బజారులో గిట్టుబాటు ధరకు విక్రయించుకోవచ్చని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. వేరుశనగ, కంది, వరికి గిట్టుబాటు కల్పించామన్నారు.
'రైతులే నేరుగా తమ పంటను విక్రయించవచ్చు'
మార్కెటింగ్ శాఖ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. రాయచోటిలో రైతుబజార్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన ఆయన.. హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి