ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు - బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తి వార్తలు

అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబీకులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు

By

Published : Mar 29, 2021, 2:52 PM IST

కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యులు వెంకటసుబ్బయ్య అంత్యక్రియలు కడపలోని ఆయన పొలంలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో బాధపడుతూ నిన్న ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కడప కో - ఆపరేటివ్ కాలనీలోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు తోపాటు కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు.

పెద్ద సంఖ్యలో ఆయన బంధువులు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు వచ్చారు. అధికార లాంఛనాల్లో భాగంగా... పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. వెంకటసుబ్బయ్య భార్య పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details