కడప జిల్లా వల్లూరు మండలం కోప్పొలు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (58) కరోనాతో మరణించింది. కరోనా భయంతో దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు వెనుకంజ వేశారు. అంత్యక్రియలు నిర్వహించాలని… కమలాపురం మదర్ థెరిస్సా సేవా సమితి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ విజయ్ కుమార్ను కోరారు. ట్రస్టు సభ్యులు విల్సన్, తరుణ్, మా ఊరి సేవా సమితి అధ్యక్షుడు శ్రీనివాసులుతో కలిసి విజయ్… మృతురాలికి అంత్యక్రియలు జరిపించారు.
మానవత్వం చాటుకున్న మదర్ థెరిస్సా సేవా సమితి.. కరోనా మృతురాలికి అంత్యక్రియలు
కరోనా వల్ల పరిస్థితులు రోజురోజుకీ దుర్భరమవుతున్నాయి. మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి. చివరి రోజుల్లో తోడుగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు... కొవిడ్ సోకిన వారిని అనాథల్లా వదిలేస్తున్నారు. మృతుల.. అంత్యక్రియల నిర్వహణకు వెనుకాడుతున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, సేవా సమితి వారిని సంప్రదిస్తున్నారు.
కరోనా మృతురాలికి అంత్యక్రియలు
కుటుంబ సభ్యులు లక్ష్మమ్మ మృతుదేహాన్ని అనాథలా వదిలేసినా.. సేవా సమితి సభ్యులే ఆత్మ బంధువులై అంతిమఘట్టం నిర్వహించి.. మానవత్వం చాటుకున్నారు.
ఇదీ చదవండి:కరోనా మృతుల్లో.. 65% పురుషులే..!