ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్సాహంగా విద్యార్థుల స్వాగతోత్సవం - freshers party at annamacharya engineering college at kadapa

కడప జిల్లాలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీ.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల స్వాగతోత్సవంలో విద్యార్థులు నృత్యాలతో హోరెత్తించారు. ఆకాశమే హద్దుగా కేరింతలు కొడుతూ స్వాగతోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు.

కడప జిల్లా అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల స్వాగతోత్సవంలో పాల్గొన్న సినీ గేయ రచయిత చంద్రబోస్

By

Published : Oct 4, 2019, 5:48 PM IST

అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల స్వాగతోత్సవం

కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు స్వాగతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత చంద్రబోస్ హాజరయ్యారు. విద్యార్థులకు సమయపాలన ఎంతో అవసరమని...ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే నిత్య పఠనం తప్పనిసరి అని తెలిపారు. జీవితంలో ఎంత పెద్దస్థాయికి ఎదిగినా ఒదిగి జీవించాలన్నారు. ఎదిగిన స్థాయిని నిలబెట్టుకునేందుకు వినయ విధేయతలే సోపానాలు అని విద్యార్థులకు వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details