ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం - ప్రొద్దుటూరు

హార్ట్​ఫుల్​నెస్, రామచంద్ర మిషన్ సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా మూడు రోజుల ధ్యాన శిక్షణ కార్యాక్రమాలను ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు.

ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం

By

Published : Sep 12, 2019, 9:23 AM IST

ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం
కడప జిల్లా ప్రొద్దుటూరు వాసవీ కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు ఉచితంగా ధ్యాన శిక్షణ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. హార్ట్​ఫుల్​నెస్, రామచంద్ర మిషన్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యాక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ కో ఆర్డినేటర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ధ్యానం ద్వారా మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కార్యాక్రమంలో తెలియజేస్తామని తెలిపారు. ఈ ఉచిత ధ్యాన శిక్షణను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details