ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్పీ విశాల హృదయం.. పోలీస్​స్టేషన్​లో భోజనం - కడప డీఎస్పీ కార్యాలయంలో భోజనం

పోలీస్​స్టేషన్​కు వెళ్లాలంటే ఇప్పటికీ ప్రజలు భయపడుతుంటారు. అయితే అక్కడకి మాత్రం నిర్భయంగా వెళ్లొచ్చు. వారి సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందవచ్చు. అంతేకాదు. పోలీసులు పెట్టే భోజనం తిని సంతోషంగా ఇంటికెళ్లొచ్చు. అదేంటి పోలీస్​ స్టేషన్​లో భోజనం ఎవరు పెడతారనుకుంటున్నారా.. అయితే ఇది చదివేయండి.

డీఎస్పీ విశాల హృదయం.. పోలీస్​ స్టేషన్​లో భోజనం

By

Published : Nov 17, 2019, 12:57 PM IST

డీఎస్పీ విశాల హృదయం.. పోలీస్​ స్టేషన్​లో భోజనం

కడప డీఎస్పీ కార్యాలయానికి నిత్యం 50 మందికి పైగా ఫిర్యాదుదారులు వస్తుంటారు. డీఎస్పీ వారి సమస్యలు విని పరిష్కారం సూచిస్తారు. అయితే ఇదంతా అయ్యేసరికి రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కోసారి రోజంతా బాధితులు అక్కడే ఉండాల్సిరావచ్చు. అందుకే వారికోసం డీఎస్పీ తన సొంత ఖర్చుతో భోజన ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు చేయడానికి అక్కడకి వచ్చేవారు కడుపునిండా అన్నం తిని వెళ్లవచ్చు. స్పందన కార్యక్రమానికి ఎక్కువగా మధ్య, నిరుపేద వర్గాల వారు వస్తారనీ.. బయట భోజనం చేసేందుకు వారివద్ద డబ్బులు ఉండవనీ.. అందుకే ఈ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమస్యకి పరిష్కారం దొరికినా.. దొరకకపోయినా కడుపునిండా భోజనం పెడుతున్నారని బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details