ప్రజాసేవకులకు 21 రోజుల పాటు ఉచిత భోజనం - మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి
లాక్డౌన్ నేపథ్యంలో అన్ని చోట్ల హోటళ్లను మూసేశారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని రాజంపేటలో 21 రోజుల పాటు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి.
కరోనా నియంత్రణకు సేవలందిస్తున్న పోలీస్, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు 21 రోజులపాటు ఆహారాన్ని అందించనున్నట్లు మాజీఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని ఆకేపాటి భవనంలో అన్నమయ్య రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. లాక్డౌన్ కారణంగా ఎక్కడా హోటళ్లు లేవని, దీనివల్ల పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది ఆహారానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యను తీర్చేందుకు 21 రోజుల లాక్డౌన్ సమయంలో ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను ప్రతిఒక్కరూ పాటించాలని, కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:కరోనా అనుమానితులను వెనక్కి పంపిన వైద్యులు