ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య..వారికి మాత్రమే

Free Education In Private Schools: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని తాపత్రయ పడుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తారా స్థాయికి చేరుకున్నాయి. తల్లిదండ్రుల ఆశలను నిజం చేయడానికి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్ధులకు కేటాయించాలని, ఉచిత విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి తెలిపారు.

25 శాతం బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్ధులకు ఉచిత విద్య
25 శాతం బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్ధులకు ఉచిత విద్య

By

Published : Mar 25, 2023, 4:49 PM IST

Free Education In Private Schools : రానున్న విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు కేటాయించే విధంగా, ఉచిత విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి తెలిపారు. గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చిందని, గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను ప్రవేట్ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆన్​లైన్​లో దరఖాస్తు విధానం : ఈ ఏడాది ఐదు నుంచి ఆరు వేల మంది విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని రాఘవ రెడ్డి చెప్పారు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ పోర్టల్ www.csc.ap.gov.in/rte ద్వారా వాళ్లు అడ్మిషన్స్ అప్లై చేసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమీపంలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఆన్​లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సెల్ ఫోన్లలో కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామని తెలిపారు.

పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు : ఒకటవ తరగతి నుంచి ఉచిత విద్యను అందిస్తామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 471 పాఠశాలల యాజమాన్యాలు కూడా ముందుకు వచ్చాయని ఇదివరకే 71 పాఠశాల యాజమాన్యాలు ఈ విధానాన్ని అమలు పరుస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఉచిత విద్యను అందించకపోతే వారు గుర్తింపును రద్దు చేసేందుకు కూడా వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు.

పుస్తకాలు, యూనిఫామ్​లు మీ బాధ్యత.. ఫీజులు మా బాధ్యత :విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, యూనిఫామ్​లు మాత్రం తల్లిదండ్రులు భరించాలని, ఫీజులు మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. గత సంవత్సరం చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో అనుకున్నంత స్థాయిలో ముందుకు సాగలేకపోయామని, ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఉన్నామని విద్యాశాఖ అధికారి రాఘవ రెడ్డి చెప్పారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య..వారికి మాత్రమే..త్వరపడండి

"471 ప్రైవేటు పాఠశాలలో ఒకటవ తరగతిలో ప్రవేశానికి మన పాఠశాల విద్యాశాఖ పోర్టల్ www.csc.ap.gov.in/rte ద్వారా వాళ్లు అడ్మిషన్స్ అప్లై చేయడం కోసం నిన్నటి నుంచే పోర్టల్ ఓపెన్ అయ్యింది. వచ్చే సంవత్సరం ఒకటవ తరగతి పిల్లలు పోర్టల్ నమోదు చేసుకుంటే పాఠశాల ప్రిపరెన్స్ తీసుకోవడానికి వీలుంది. " - రాఘవ రెడ్డి, వైఎస్సార్ జిల్లా విద్యాశాఖ అధికారి

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details