కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్టులో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి.. ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా... ఈ సంవత్సరం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడకు చెందిన వైద్యుడు శ్రీకాంత్ క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు చేశారు. శిబిరానికి వచ్చిన 120 మందికి పైగా రోగులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. 9 నుంచి 15 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి వ్యాక్సిన్ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా కాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లను వైద్యుడు శ్రీకాంత్ రోగులకు వివరించారు. విమల పౌండేషన్ ఆధ్వర్యంలో చాలామందికి ఆర్థిక సహాయం అందించారని.. వైద్య ఖర్చులకు కూడా వారే భరిస్తున్నారని క్యాన్సర్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాలో ఉచిత క్యాన్సర్ శిబిరానికి విశేష స్పందన
కడప జిల్లా ప్రొద్దుటూరులోని రాయల్ కౌంటీ రిసార్టులో మహిళల బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది.
కడప జిల్లాలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరైన ప్రజలు