కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా బెంగళూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. విహారయాత్ర కోసం బయలుదేరిన 10 మంది బృందం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి మరో 10 మందితో కలిసి మొత్తం 20 మంది వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అక్కడ ఆడుకుంటూ దిగువనున్న గండి మడుగులోకి సరదాగా ఈతకు వెళ్లారు. వారిలో నలుగురు గల్లంతయ్యారు.
FOUR DIED: విహారయాత్రలో విషాదం..గండి మడుగులో నలుగురు గల్లంతు - Four died fall into water at kadapa
విహారయాత్రలో విషాదం
18:34 August 07
విహారయాత్రలో విషాదం
బెంగళూరుకు చెందిన తాజ్ మహ్మద్(40), మహ్మద్ హంజా(12), ఉస్మాన్ ఖానమ్(11), మహ్మద్ హఫీజ్(10)లు గల్లంతైన వారిలో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి బంధువుల రోదనలతో ఘటనస్థలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి
murder case: స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
Last Updated : Aug 7, 2021, 9:57 PM IST