కడప జిల్లా రాజంపేటలో ఎన్టీఆర్ జయంతిని ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తెదేపా పట్టణ, మండల పార్టీ ఆధ్వర్యంలో పట్టణ బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ భారీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి గజమాలతో ఘన నివాళి అర్పించారు. లడ్డూలను పంపిణీ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెదేపాను అదే పంథాలో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకు వెళుతూ ఎంతో చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు - కడప జిల్లా, రాజంపేట
కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి గజమాలతో ఘన నివాళి అర్పించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు
వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అన్ని రద్దులతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సంజీవ రావు, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండివేడికి మేడ మీద పడుకుంటే.. చల్లగా దోచేశారు!