కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం కంసులపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో... రూ. 50లక్షల వ్యయంతో నిర్మించనున్న అగ్రీ ల్యాబ్ పనులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన నవరత్నాల్లో వ్యవసాయం మొదటిదన్నారు. అందుకే సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. అగ్రీ ల్యాబ్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులందరికీ రైతుభరోసా అందజేస్తున్నామని చెప్పారు.
అగ్రీ ల్యాబ్ నిర్మాణానికి కమలాపురం ఎమ్మెల్యే శంకుస్థాపన - ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
నవరత్నాల్లో మొదటిదైన వ్యవసాయానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని.. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని కంసులపురంలో అగ్రీ ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అగ్రి ల్యాబ్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన