ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం - మైలవరంలో బాలికపై వ్యక్తి అత్యాచారం వార్తలు

రానురాను మనుషుల్లో మానవత్వం చనిపోతోంది. తప్పు చేయాలనుకునే దుర్మార్గులకు ఏమీ కనిపించడం లేదు. ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో జరిగింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

forty years man raped seven years girl in mylavaram kadapa district
కడప జిల్లాలో బాలికపై అత్యాచారం

By

Published : Aug 30, 2020, 3:23 PM IST

కడప జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న బాలికను రామాలయంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బాలికను వైద్య పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details