నలభై ఏడు ఎర్రచందనం దుంగలను కడప జిల్లా రాజంపేట అటవీ డివిజన్ అధికారులు పట్టుకున్నారు. రోళ్లమడుగులోని తీగలకోన వద్ద అటవీ సిబ్బందికి తమిళ కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఒక్కరు మినహా మిగిలిన వారు పరారైనట్లు రాజంపేట రేంజర్ నారాయణ తెలిపారు.
రోళ్లమడుగులో 47 ఎర్రచందనం దుంగలు పట్టివేత - red sandal logs caught at rollamadugu
టమోట లారీ మాటన ఏపీలోకి ప్రవేశించి ఎర్రచందనం తరలిస్తున్న తమిళ కూలీలను.. కడప జిల్లా రోళ్లమడుగులో అటవీ అధికారులు అడ్డుకున్నారు. 47 దుంగలు వారి నుంచి స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని రాజంపేట రేంజర్ తెలిపారు.
అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దుంగలు
ఈనెల 11న తమిళనాడుకు చెందిన 35 మంది కూలీలు.. టమోట లారీ మాటున అడవిలోకి ప్రవేశించారని రేంజర్ వివరించారు. డీఎఫ్ఓకు అందిన సమాచారం మేరకు వారి కోసం జల్లెడ పట్టామన్నారు. ఈ దాడిలో 1.4 టన్నుల బరువున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం వాటి విలువ రూ.3.51 లక్షలు ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 50 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేశారు.
ఇదీ చదవండి:వైకాపాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి