ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరు పోలీసుల తీరుపై మాజీఎమ్మెల్యే మండిపాటు - proddutur former mla varadarajulureddy

కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు క‌రోనాను వ‌రంగా మార్చుకొని అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్​ను పూర్తిగా తగ్గించామని ఆయన తెలిపారు.

former mla varadarajulureddy fires on produttur police
ప్రొద్దుటూరు పోలీసులపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ధ్వజం

By

Published : May 17, 2020, 4:22 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు పోలీసుల‌పై... మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఫ్యాక్ష‌న్ను పోలీసులే ప్రోత్స‌హిస్తున్నార‌ని ఆరోపించారు. అసాంఘిక కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవాల్సిన పోలీసులే అవినీతికి పాల్ప‌డ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఊరు వ‌దిలి వెళ్లిన క్రికెట్ బుకీలు మ‌ళ్లీ తిరిగి వ‌చ్చార‌న్నారు.

పుర‌పాలిక అధికారులు, పోలీసులు క‌రోనాను వ‌రంగా మార్చుకొని అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని వరదరాజులరెడ్డి విమ‌ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీ ర‌మ‌ణారెడ్డి హ‌త్య రాజ‌కీయాలు చేశార‌న్న వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి... తాను ఎమ్మెల్యే అయ్యాక పోలీసు అధికారుల‌తో క‌లిసి ఫ్యాక్ష‌న్ను త‌గ్గించ్చామ‌‌న్నారు. కానీ ప్రొద్దుటూరులో ఇప్పుడు మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ పెరిగిపోతోంద‌ని మండిప‌డ్డారు. సీఐ స్థాయి నుంచి డీఎస్పీ వ‌ర‌కూ ప్రొద్దుటూరులో అవినీతే ధ్యేయంగా ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details