ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వందల సంఖ్యలో చుక్కల భూముల సమస్యలున్నాయని అపరిష్కృతంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. అధికారులకు అనేక మార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం ఉండటం లేదన్నారు. ప్రభుత్వాలు చుక్క భూముల వివాదాల్ని పరిష్కరించాలని ఆదేశించినా రెవిన్యూ అధికారులు కాలయాపన చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పరిష్కారం కోసం ప్రొద్దుటూరు తాహశీల్దారు కార్యాలయం ఎదుట ఈ నెల 16 నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వరదరాజుల రెడ్డి ప్రకటించారు.
చుక్కభూముల సమస్యలపై అధికార్లపై మండిపడ్డ వరదరాజుల రెడ్డి - ప్రొద్దుటూరు రెవిన్యూ కార్యాలయం
చుక్క భూముల విషయంలో రెవిన్యూ అధికారులు ప్రజలకు చుక్కలు చూపిస్తూన్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. భూ సమస్యను పరిష్కరించకపోతే ప్రొద్దుటూరు రెవిన్యూ కార్యాలయం ఎదుట ఈ నెల 16 నుంచి తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు.
former mla varadarajulareddy talking about Farmers Problems in kadapa district