ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీఎస్పీ శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు - మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. డీఎస్పీ అవినీతికి పాల్పడ్డారంటూ... మీడియా సమావేశాల్లో ఆరోపణలు చేస్తున్న వరదరాజులరెడ్డి... తాజాగా కరపత్రం విడుదల చేశారు.

మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

By

Published : Jun 29, 2019, 9:20 PM IST

మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావుకు ప్రభుత్వం ఇటీవలే స్థాన చలనం కల్పించింది. బదిలీ అయిన తర్వాతా.. ఆయనపై అవినీతి ఆరోపణలు ఆగడం లేదు. శ్రీనివాసరావు రెండేళ్లుగా ప్రొద్దుటూరులో సివిల్ పంచాయితీలు, క్రికెట్ బెట్టింగ్​లు, మట్కా, గ్యాంబ్లింగ్ రాయుళ్ల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి ఆరోపించారు. అనతి కాలంలోనే రూ.3 కోట్లు సంపాదించారన్నారు. ఆయన అవినీతిపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మాజీ డీజీపీ ఠాకూర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తాజాగా కడప ఎస్పీ అభిషేక్ మొహంతికీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీనివాసరావును ఎక్కడికి బదిలీ చేసినా... విచారణ చేసి సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని వరదరాజులురెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తానని చెబుతున్నారనీ.. అవినీతి పరులైన అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details