Viveka Murder Case : మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులను కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని ప్రత్యేకంగా.. పోలీసు బందోబస్తు మధ్య తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి తీసుకువెళ్లారు. నాలుగు వాహనాల్లో ముగ్గురు నిందితులను వేరువేరుగా పోలీసులు హైదరాబాదుకు తరలించారు. ఇప్పటికే బెయిల్పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి హైదరాబాద్ చేరుకున్నారు. నిందితులను ఈ రోజు ఉదయం 10 : 30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరపరచనున్నారు.
వివేకా హత్య కేసు.. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు నిందితులు - సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసు నిందితులు
Former Minister Vivekananda Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులు హైదరాబాద్ సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. నిందితులను కడప జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించారు.
వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయిన తర్వాత తొలిసారిగా ఐదుగురు నిందితులు హైదరాబాద్లో సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు. కోర్టులో హాజరైన తర్వాత ముగ్గురు నిందితులను తిరిగి కడప జైలుకు తీసుకొస్తారా లేక చంచల్గూడ తరలిస్తార అనేది తెలియాల్సి ఉంది. ఇది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిందితులను హైదరాబాదుకు తీసుకెళ్తున్న క్రమంలో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి ఆయన్ను కలిసి వచ్చారు. శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :