గ్రామ సచివాలయం వ్యవస్థపై తనకు వ్యక్తిగతంగా స్పష్టత లేకపోయినా.. గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని బస్టాండ్ కూడలిలో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం..సచివాలయ వ్యవస్థపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీటి ద్వారా ఏడాదిలోగా పేదలకు ఫలాలు అందాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి.. సచివాలయ వ్యవస్థను విజయవంతం చేయాలని కోరారు.
'సచివాలయ వ్యవస్థను విజయవంతం చేయాలి' - గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
గ్రామ సచివాలయం గురించి తనకు అవగాహన లేదు.. కానీ ప్రభుత్వం మాత్రం గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తుందని మాజీమంత్రి అన్నారు.
Former minister DL Ravindra Reddy says government is stepping up towards village independence