కడప జిల్లా చిట్వేలు మండలంలోని రాపూరు - చిట్వేల్ రహదారిలో వెలుగొండ అడవి అగ్నికి ఆహుతైంది. చిట్వేల్ - రాపూరు రహదారిలో వెలిగొండల్లో భారీగా కార్చిచ్చు ప్రబలి అడవి దహించుకుపోతోంది. ఎంతో విలువైన ఎర్రచందనంతో పాటు వృక్షసంపద, జంతుజాలం అగ్నికి ఆహుతయ్యాయి.
రహదారి గుండా పోయే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుందని అక్కడి స్థానికులు అనుమానిస్తున్నారు. గత ఐదారు నెలల నుంచి భారీ వర్షాలు పడడంతో.. అడవి పచ్చని చెట్లతో కళకళలాడుతున్న సమయంలో ఇలా జరగడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.