ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో విదేశీయుల 'కృష్ణ' సంకీర్తన - రాజంపేటలో విదేశీయుల కృష్ణ భజనలు

కడప జిల్లా రాజంపేటలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో విదేశీయులు హరేరామ హరేకృష్ణ అంటూ నగర సంకీర్తన చేపట్టారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తూ భక్తి భావంలో పులకించిపోయారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

foreign devotees bhajanas at rajampet kadapa district
రాజంపేటలో విదేశీయుల సంకీర్తన

By

Published : Feb 9, 2020, 12:02 PM IST

రాజంపేటలో విదేశీయుల సంకీర్తన

కడప జిల్లా రాజంపేటలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో సాయిబాబా ఆలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్, శివాలయం మీదుగా ఆంజనేయస్వామి ఆలయం వరకు హరేరామ- హరేకృష్ణ నగర సంకీర్తన సాగింది. రష్యాకు చెందిన విదేశీయులు హరేరామ - హరేకృష్ణ.. కృష్ణకృష్ణ - హరేహరే అంటూ భక్తి గీతాలు ఆలపించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ, కృష్ణ తత్వాన్ని బోధిస్తూ ఈ సంకీర్తన సాగింది. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details