రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పట్టణంలోని ధర్మాపురం, గాంధీనగర్, లక్ష్మీపురం, న్యూ క్రిష్ణ నగర్‌కు చెందిన పేద ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. లాక్డౌన్ కారణంగా కోడూరలోని యువత గత కొన్ని రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి కొంతమంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు.
పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే - రైల్వేకోడూరు ఎమ్మెల్యే అన్నదానం న్యూస్
లాక్డౌన్ కారణంగా కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
![పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6641468-908-6641468-1585890684090.jpg)
పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే