కడప జిల్లా కమలాపురంలో పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి భోజనాలు పెడుతున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు పేదలకు, యాచకులకు ఆహారం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు భోజనం పంపిణీ చేస్తామని చెప్పారు. పేదల ఆకలి తీర్చడంలో ఉన్న సంతోషం మరే కార్యక్రమంలో ఉండదని ఆనందం వ్యక్తం చేశారు.
'లాక్డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు ఆహారం పంపిణీ చేస్తాం' - lockdown
రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలవుతోన్న లాక్డౌన్ కారణంగా పేదలు, యాచకులు, అన్నార్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కొందరు తమవంతు సహాయం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.
కమలాపురంలో పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం