కడప జిల్లా పులివెందులలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల.. బాలుర వసతి గృహంలో భోజనం తిని ఐదుగురు విద్యార్థులు.. అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో భోజనం తిన్న ఐదుగురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో.. పులివెందులు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఫుడ్ పాయిజన్ అయ్యి... విద్యార్థులకు అస్వస్థత మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్..
'పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వండుతున్నారు. నీళ్లలాంటి సాంబార్‌తో భోజనం వడ్డిస్తున్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్..' అంటూ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విధంగా చాలా సార్లు జరిగిందనీ.. హాస్టల్ వార్డెన్ పట్టించుకోక పోగా.. చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:కడప జిల్లాలో పుర ఎన్నికలపై కలెక్టర్ సమావేశం