కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. వనిపెంటకు చెందిన నాని సుధీర్ అనే బాలుడు 30 వేల రూపాయల విలువ చేసే మద్యం దొంగిలించాడని.. బండి కిషోర్‌తో పాటు మరో నలుగురు కలిసి ఈనెల 13వ తేదీ కొట్టారు. అంతటితో ఊరుకోక బాలుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నాని సుధీర్‌ని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు.
బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో ఐదుగురు అరెస్ట్ - కడప జిల్లా ముఖ్య వార్తలు
మైదుకూరు మండలం వనిపెంటలో బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ