కడప జిల్లాకు కొత్తగా కేటాయించిన 16 మంది ఫైర్‌మెన్, నలుగురు అగ్నిమాపక అధికారులకు స్థానిక చెరువులో శిక్షణ నిర్వహించారు. తుపాన్లను ఎదుర్కొనేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ సిద్ధంగా ఉందని అధికారి భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రమాదవశాత్తు వరదలు, తుపాను వచ్చినప్పడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే వారిని ఎలా రక్షించాలో శిక్షణలో నేర్పించామని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు.
'తుపాన్లను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం'
జిల్లాలో తుపాన్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. కడపలోని స్థానిక చెరువులో కొత్తగా కేటాయించిన 16 మంది ఫైర్‌మెన్, నలుగురు అగ్నిమాపక అధికారులకు నీటిలో శిక్షణ నిర్వహించారు.
కడపలో అగ్నిమాపక సిబ్బంది శిక్షణా కార్యక్రమం