పాడుబడిన బావిలో పడిన శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడిన ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది. రైల్వే స్టేషన్ మార్గంలోని కృష్ణానగర్లో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు శునకం పడింది. బావి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. బావిలో పడిన శునకాన్ని బయటికి తీశారు.
బావిలో పడిన శునకాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది - రాజంపేట నేటి వార్తలు
కడప జిల్లా రాజంపేటలో పాడుబడిన బావిలో శునకం పడిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో శునకాన్ని బావి నుంచి బయటకు తీశారు.
బావిలో పడిన శునకాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది