Fire To Vehicles: వైయస్ఆర్ జిల్లా వేంపల్లెలో వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం మళ్లీ మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో నాలుగు మోటర్ బైకులకు, కారుకు నిప్పు పెట్టడం జరిగింది. పోలీసులు నిఘా పెట్టి ఒక మానసిక రోగిపై అనుమానంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానసిక ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల మౌనంగా ఉన్న గుర్తు తెలియని దుండగులు మళ్లీ రంగంలోకి దిగి వాహనాలకు నిప్పు పెడుతున్నారు.
మిస్టరీ.. వేంపల్లెలో వరుసగా వాహనాలకు నిప్పు - కడప వార్తలు
Fire To Vehicles: గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టడం అక్కడి వారు భయానికి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు జరిగిన పోలీసులు సరైనా పరిష్కారం చేయకపోవడంతో స్థానికులకు వారిపై నమ్మకం కోల్పొతున్నారు. ఈ సంఘటన వైయస్ఆర్ జిల్లా జరిగింది.
fire to vehicles
వేంపల్లెలోని తిరుమల సినిమా హాల్ వద్ద గురువారం తెల్లవారుజామున మహమ్మద్ రఫి పార్కింగ్ చేసిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెడుతుండగా స్థానిక మహిళలు చూసి కేకలు వేశారు. దీంతో దుండుగులు పరారైనట్లు వారు తెలిపారు. వేంపల్లెలో వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండడంతో పోలీసులకు ఛాలెంజ్‌గా మారింది.
ఇవీ చదవండి
Last Updated : Jan 26, 2023, 1:21 PM IST
TAGGED:
Fire To Vehicles