కడప జిల్లా దేవుని కడప రహదారిలోని పసుపు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు కర్మాగార యాజమాన్యం తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని అగ్న మాపక సహాయాధికారి మాధవ నాయుడు తెలిపారు.
కడపలో అగ్ని ప్రమాదం...రూ.35 లక్షల ఆస్తి నష్టం - Fire in Kadapa Rs 35 lakh property damage
దేవుని కడప రహదారిలోని పసుపు కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.
![కడపలో అగ్ని ప్రమాదం...రూ.35 లక్షల ఆస్తి నష్టం Fire in Kadapa ... Rs 35 lakh property damage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5399645-865-5399645-1576573462512.jpg)
కడపలో అగ్ని ప్రమాదం...రూ.35 లక్షల ఆస్తి నష్టం