కడప జిల్లా వేంపల్లె పట్టణ సమీపంలోని పాపాగ్ని నది ఒడ్డున ఉన్న వృషబాచలేశ్వర దేవస్థానానికి చెందిన ఎద్దుల కొండకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగి ఎద్దుల కొండ మొత్తం కాలిపోయింది. కొండ కింద భాగంలో మామిడి, నిమ్మ చెట్లు సాగు చేస్తుండగా.. అగ్ని రవ్వలు పడడంతో మంటలు ఆర్పేందుకు నానా ఆవస్థలు పడ్డారు. మంటలు ఎక్కువ కావటంతో దేవస్థానం ఈఓ ప్రతాప్ పులివెందుల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. ఎద్దుల కొండ సమీపంలో ప్రతి రోజు గుంపులు గుంపులుగా ఆకతాయిలు ఉంటారని.. వారి కారణంగానే ఇలా జరిగి ఉంటుందని ఈఓ చెప్పారు. ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదని ఆలయ ఈఓ ప్రతాప్ చెప్పారు.
ఎద్దుల కొండకు నిప్పుపెట్టిన ఆకతాయిలు - కడప జిల్లాలో వృషబాచలేశ్వర దేవస్థానం వార్తలు
కడప జిల్లా పాపాగ్ని నది ఒడ్డున ఉన్న వృషబాచలేశ్వర దేవస్థానానికి చెందిన ఎద్దుల కొండకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఈఓ ప్రతాప్ తెలిపారు.
ఎద్దుల కొండకు నిప్పుపెట్టిన ఆకతాయిలు