KAdapa News: కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ అలుముకుంది. దీనివల్ల జనం ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వైపు గాలి వీస్తుండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగలు మంటలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accident: పాత సామానుల గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం - fire accident in scrap godown in kadapa
Fire Accident in Scrap Godown: కడప శివారులోని ఊటుకూరు వద్ద పాత సామానుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మధ్యాహ్న సమయంలో గోదాములో పని చేస్తున్న వాళ్లు అందరూ భోజనం చేస్తుండగా.. గోడౌన్ చివరలో మంటలు చెలరేగాయి. దీనికి తోడు గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లో మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాత అట్టపెట్టెలు బీరు సీసాలు పాత సామాన్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. సమీపంలో ఉన్న వారందరినీ అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది 10 వాహనాల నీళ్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లిన్నట్లు సమాచారం. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. ప్రమాదంపై పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:AP Crime News: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి.. పలువురు అరెస్టు