ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బేకరీలో అగ్నిప్రమాదం.. రూ.15 లక్షల ఆస్తి నష్టం - fire accident in kadapa news

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ ప్రైవేట్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన సామాగ్రితో పాటు, మిఠాయిలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని యజమాని వాపోయారు.

బేకరీ అగ్నిప్రమాదం
బేకరీ అగ్నిప్రమాదం

By

Published : Feb 6, 2021, 12:26 AM IST

కడప జిల్లా రాయచోటి పట్టణం సంజీవ్ నగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ బేకరీ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బేకరీలో నూనె, గ్యాస్ సిలిండర్లు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో దుకాణంలో పని చేసే సిబ్బంది పరుగులు తీశారు. పొగ విపరీతంగా రావటంతో స్థానికులు భయాందోళనలకు గురై..అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన సామాగ్రితో పాటు, మిఠాయిలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని యజమాని వాపోయారు.

బేకరీలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details