FIRE ACCIDENT: వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ కర్మాగారం గోడౌన్‌లో రాత్రి 11గంటల 30నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగార సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. మంటలు ఎక్కువగా ఉండటంతో పులివెందుల, వేంపల్లి, కమలాపురం, యురేనియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఇవ్వాళ ఉదయం వరకు మంటలను అదుపు చేయడానికి శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సుమారు రూ.లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఎన్‌ఎస్‌ఎల్ కర్మాగారంలో అగ్నిప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం - ap fire accidents
FIRE ACCIDENT: పులివెందులలోని ఎన్‌ఎస్‌ఎల్ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 11.30 గంటల సమయంలో కర్మాగారం గోదాములో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
FIRE ACCIDENT