కడప జిల్లా పులివెందులలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. పలు రికార్డులు దగ్ధమయ్యాయి. బంగారు నగలు తూకం వేసే సామగ్రి కాలిపోయింది. బ్యాంకు వెనుకభాగంలో ఉన్న చెట్లకు నిప్పు పెట్టడంతో ఆ మంటలు బ్యాంకులోకి వ్యాపించాయి. ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో సిబ్బంది ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెలవుదినాల్లో మంటలు వ్యాపించటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మంటలు... రికార్డులు దగ్ధం
కడప జిల్లా పులివెందులలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మంటలు చెలరేగి పలు రికార్డులు దగ్ధం అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఉండకపోతే భారీ నష్టం కలిగేదని అధికారులు తెలిపారు.
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మంటలు...రికార్డులు దగ్ధం