కడప(kadapa district) నగరంలోని పీఎఫ్ కార్యాలయం సమీపంలోని సోఫా తయారీ దుకాణంలో అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. దుకాణం నుంచి దట్టమైన పొగలు బయటకి రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలో సామగ్రి అంతా కాలి బూడిదైంది.
Fire accident: సోఫా తయారీ దుకాణంలో అగ్ని ప్రమాదం - కడప జిల్లా వార్తలు
కడప నగరంలోని ఓ సోఫా తయారీ దుకాణంలో అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో దాదాపు రూ.మూడు లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
కడపకు చెందిన శ్రీనివాసులు కొంత కాలంగా సోఫా తయారీ దుకాణంతో పాటు కుట్టు మిషిన్ పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు. దీపావళి పండుగ(diwali festival) రోజున దుకాణం మూసివేశారు. ఉన్నట్టుండి దుకాణం నుంచి మంటలు రావటంలో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ప్రమాదంలో సోఫా తయారీకి ఉపయోగించే పలురకాల సామాగ్రి, కుట్టు మిషన్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.మూడు లక్షల మేరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. తనకు జీవనాధారమైన దుకాణం కాలిపోవటంతో ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ఇదీ చదవండి:FIRE ACCIDENT: సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం..రూ. 15 లక్షల ఆస్తి నష్టం!