ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం - కడప నేటి వార్తలు

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి జిల్లా ఎస్పీ ఆర్థిక సహాయం అందజేశారు. విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు తమ వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.

financial support to died home guard family members in kadapa
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

By

Published : Sep 28, 2020, 7:51 PM IST

విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన పోలీస్ కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని... కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు నాగరాజు కుటుంబానికి... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా అధికారులు రూ. ఐదు లక్షలు చెక్కును అందజేశారు. పోలీసులు, హోంగార్డులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని రావాలని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details