ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడిని కత్తితో నరికిన తండ్రి - కడప జిల్లాలో కొడుకుపై దాడి చేసిన తండ్రి

కన్నతండ్రే కొడుకుపై కత్తిదూశాడు. మద్యం మత్తులో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. కత్తితో కుమారుడి తలపై నరికాడు ఆ తండ్రి. తీవ్రంగా గాయాపడ్డ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

father attack
father attack

By

Published : Jul 16, 2020, 12:20 AM IST

కడప జిల్లా.. వీఎస్ పల్లె మండలం.. ఓబులెరెడ్డి పల్లెలో దారుణం జరిగింది. కేశవ తన కుమారుడు మూర్తికేశవను తలపై కత్తితో నరికాడు. మద్యం మత్తులో ఉన్న కేశవ 23 ఏళ్ల కొడుకు మూర్తికేశవతో ఘర్షణ పడ్డాడు. ఈ ఘటనలో కుమారుడిని తీవ్రంగా గాయపరిచాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేశవను అదుపులోకి తీసుకున్నారు. మూర్తి కేశవకు తలపై బలమైన గాయమై పరిస్థతి విషమించిన కారణంగా.. కడప రిమ్స్​కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details