కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో తండ్రి, ఇద్దరు కుమార్తెలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన బాలకొండయ్య, కుమార్తెలు భావన, శోభన...బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడాది క్రితమే బాలకొండయ్య భార్య మృతిచెందగా....కుటుంబ కలహాల నేపథ్యంలోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని బంధువులు అనుమానిస్తున్నారు.
బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య - కడపలో తండ్రీ కూతుర్లు ఆత్మహత్య వార్తలు
కడప జిల్లా శ్రీనివాసపురంలో నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన తండ్రీ కూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామస్థులు ఉదయం పొలానికి వెళ్తుండగా బావిలో మృతదేహాలను గుర్తించారు.
![బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6229248-756-6229248-1582858948489.jpg)
suicide