ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కలంగా నీళ్లు.. అయినా పొలాలు బీళ్లే - crop holiday in ysr district

farmers not interest to cultivate: రాయలసీమ నీళ్లు లేక బీడువారుతుందనేది నానుడి. కానీ.. కేసీ కెనాల్‌ కింద పుష్కలంగా నీళ్లు వదిలినా..పంట వేసేందుకు అన్నదాత సాహసించడం లేదు. ఎవర్ని కదిపినా మా వల్ల కాదనే మాటే..! విధిలేక పొలాల్ని బీడుపెడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.

no water
no water

By

Published : Jun 9, 2022, 9:16 PM IST

Updated : Jun 9, 2022, 10:08 PM IST

ఇక్కడ ఒకప్పుడు ఇరువైపులా పచ్చటి పైరు దర్శనమిచ్చేది. ఇప్పుడు కనుచూపుమేర బీళ్లుగా ఉన్న పొలాలను..పిచ్చి మొక్కలు ఆక్రమించేశాయి. అలా ఈ రోడ్డు దాటుకుని పల్లెల్లోకి వెళ్లినా..ఇదే పరిస్థితి. కోనసీమ జిల్లాలో అన్నదాతలు.. క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. వైఎస్సార్​ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో.. రైతులు ఏడాదిగా పంటలకు దూరంగా ఉంటున్నారు. కేసీ కెనాల్ కింద వేల హెక్టార్ల ఆయకట్టు ఉన్న రైతులు.. రెండేళ్లుగా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. కేసీ కెనాల్‌కు పుష్కలంగా నీళ్లొదిలినా సాగుచేసే ధైర్యం చేయలేకపోతున్నారు.

జిల్లాలో కేసీ కెనాల్ కింద..ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప మండలాల్లో 35 వేల హెక్టార్లలో ఏటా రైతులు వరి సాగు చేస్తారు. కూలీలు అడిగినంత ఇద్దామన్నా.. ఎరువులు, పురుగు మందుల ఖర్చులు భరిద్దామనుకున్నా.. వరికి మద్దతు ధర కరవైందని వాపోతున్నారు.

ఎకరాకు 30 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. కనీసం 10 వేల కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. చెన్నూరు మండలం రామనపల్లె, బ్రాహ్మణపల్లె, చిన్నమాచుపల్లె, చెన్నూరు, రాచమానుపల్లె, కొండపేటలో....వందల ఎకరాల భూమి బీళ్లుగా మారింది. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఇచ్చే సొమ్ము దేనికీ సరిపోవట్లేదని.. రైతులు అంటున్నారు. చాలామంది సాగు వదిలేసి.. భవన నిర్మాణ కార్మికులుగా మారారని చెబుతున్నారు.

గతేడాది వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిందని..రైతుభరోసా సిబ్బంది చెబుతున్నారు. అయితే ఎకరాకు కేవలం 6 వేల రూపాయలు వేయడం వల్ల.. వారికి ఇబ్బందులు తప్పట్లేదని వివరించారు.

కేసీ కెనాల్ కింద నీరు పుష్కలంగా ఉన్నా రైతులు సాగు చేయట్లేదంటే ఆలోచించాల్సిన విషయమని.. వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఇటీవల వ్యాఖ్యానించారు. రైతు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు నిలబడలేవని అన్నారు.

పుష్కలంగా నీళ్లు.. అయినా పొలాలు బీళ్లే

ఇవీ చూడండి

Last Updated : Jun 9, 2022, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details