కడపలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రైతు సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రైతులను, కూలీలుగా మార్చే చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో జరుగుతున్న దీక్షకు మద్దతు తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ సంస్థలకు రైతాంగాన్ని తాకట్టు పెట్టారని జిల్లా రైతు సంఘం కార్యదర్శి చంద్ర విమర్శించారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'రైతాంగాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టారు' - కడప వార్తలు
దిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా కడపలో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిపై నినాదాలు చేశాయి. కార్పొరేట్ సంస్థలకు రైతాంగాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి.
కడపలో రైతు సంఘాలు నిరసన