దిల్లీలో రైతు సంఘాలకు మద్దతుగా కడప జిల్లాలో అన్నదాతలు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా రైతులు, సీపీఐ, సీపీఎం, తెదేపా, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఐటీఐ సర్కిల్ నుంచి కోటిరెడ్డికూడలి, ఏడురోడ్లకూడలి, అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన తెలిపారు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
కడపలో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ - కడప వార్తలు
కడప నగరంలో అన్నదాతలు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, తెదేపా, ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతు పలికారు. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ