లాక్ డౌన్, విపత్తుల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అఖిల భారత కిసాన్ సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద... రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు.
'రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోండి' - అఖిలభారత కిసాన్ సంఘం
అఖిల భారత కిసాన్ సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. లాక్ డౌన్ లో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఏ విపత్తు సంభవించినా ముందుగా నష్టపోయేది రైతేనని జిల్లా రైతు సంఘం నాయకుడు చంద్ర అన్నారు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినా.. రైతుకు ఒరిగిందేమి లేదని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడానికే ప్యాకేజీ ఉపయోగపడిందని విమర్శించారు. కరోనా విపత్తు కాలంలో కడప జిల్లా వ్యాప్తంగా వేలమంది రైతులు పండించిన పంటలను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారు: డాక్టర్ సుధాకర్