కడప జిల్లా ప్రొద్దుటూరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. మైదుకూరు రోడ్డులోని దుకాణం వద్దకు వందలాది మంది యూరియా కోసం వచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా కోసం ఉదయం నుంచే దుకాణం వద్దకు చేరుకున్నారు. ప్రొద్దుటూరుతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు. చాలాసేపు క్యూలైన్లో నిలబడి యూరియా తీసుకుని వెళ్లారు. క్యూలైన్లో నిలబడలేక కొందరు అవస్థలు పడ్డారు.
యూరియా కోసం... రైతుల బారులు
ఎక్కడ చూసినా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలంలో పనులు ముందుకు సాగాలంటే ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం. దానికోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
farmers q line for urea in kadapa district proddutoor