ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం కంటే కూరగాయల అమ్మకం హీనమా.. ..? - farmers protest latest news update

నిబంధనల పేరుతో తాము పండింటిన పంటను అమ్ముకోనియకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కడపజిల్లా బద్వేలు రైతులు. రోడ్డుపై కూరగాయలను పారబోసి నిరసన తెలిపారు.

Farmers Protest throwing vegetables on the road
రైతుల నిరసన

By

Published : May 6, 2020, 9:12 AM IST

కడప జిల్లా బద్వేలులో రైతులు నిరసన చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. లాక్​డోన్ పేరుతో కూరగాయలను అమ్మనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కరోనా అంటే అందరికీ భయమేనని ఆయితే తాము అహర్నిశలు కష్టపడి పండించిన కూరగాయలను విక్రయించకుండా చేస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. బ్రాందీ షాపుల కంటే తాము అధ్వానంగా కనిపిస్తున్నామా అని పోలీసుల చర్యలపై మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులు తమ కష్టాలు గమనించి బద్వేలులో కూరగాయల విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details