ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Uranium: యురేనియం వ్యర్థాలు పంటపొలాల్లో ప్రవహిస్తున్నాయని రైతుల ఆందోళన - kadapa latest news

కడప జిల్లా వేముల మండలంలో రైతులు(farmers) ఆందోళన చేపట్టారు. తుమ్మలపల్లి యురేనియం(Uranium) కర్మాగారం నుంచి వ్యర్థ జలాలు పంటపొలాల్లోకి ప్రవహిస్తున్నాయని నిరసనకు దిగారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

uraniumuranium in fields in fields
uranium in fields

By

Published : Jun 7, 2021, 5:36 PM IST

యురేనియం వ్యర్థాలు పంటపొలాల్లో ప్రవహిస్తున్నాయని రైతుల ఆందోళన

కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం(Uranium) కర్మాగారం నుంచి వెలువడే వ్యర్థ జలాలు పంటపొలాల్లోకి ప్రవహిస్తున్నాయని రైతులు(farmers) ఆందోళనకు దిగారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు టైల్ పాండు కింద ఉన్న సంపులోకి వరద నీరు భారీగా చేరింది. సంపులో ఉన్న వ్యర్థ జలాలు పొంగిపొర్లి తమ పొలాల్లోకి వస్తున్నాయని రైతులు(farmers) ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు చేరి ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయని.. రైతులు(farmers) ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణం దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details