కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం గంగిరెడ్డిపల్లె, సంగాలపల్లె గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు రైతు భరోసా డబ్బులు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందామని పేర్కొన్నారు. ఇప్పటి సర్కారు ప్రవేశపెట్టిన రైతు భరోసా మాత్రం గెజిట్లో లేదని అధికారులు అంటున్నట్లు రైతులు తెలిపారు. తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
రైతు భరోసా అందలేదంటూ అన్నదాతల ఆందోళన - రైతు భరోసా తాజా న్యూస్
కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లె, సంగాల పల్లే గ్రామంలోని రైతులు.... తమ ఖాతాల్లో రైతు భరోసా పడలేదంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే బాధిత రైతుల ఖాతాలో రైతు భరోసా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

farmers protest for raithu bharosa at virapunayunipalle