కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బయనపల్లెకు చెందిన కట్టా శివయ్యనాయుడు... తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శివయ్యకు గ్రామ సమీపంలో 30 సెంట్ల భూమి ఉంది. అరటి, బొప్పాయి పంటలు వేశాడు. పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. పంట సరిగా లేని పండని కారణంగా అప్పులు తీర్చలేదు. ఆ మనోవేదనతో బుధవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేళ్ల కిందట అనారోగ్యంతో అతని భార్య మృతి చెందింది. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అన్నదాతను కబళించిన అప్పు... పొలంలోనే రైతు ఆత్మహత్య - kadapa district latest farmers suicide news
అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా... రైతుల జీవితాలు మాత్రం మారటంలేదు. ఎన్ని పథకాలు వచ్చినా రైతుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ రైతు తన పొలంలోనే ఊరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అన్నంపెట్టిన పొలంలోనే ఊరేసుకున్న రైతు