కడప జిల్లా గోపవరం మండలం చెర్లో రామాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో సుబ్బారాయుడు అనే రైతు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం వరి పొలానికి నీరు పెట్టేందుకు అతను వెళ్లాడు. వ్యవసాయ మోటార్‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చేందుకు విద్యుత్ స్తంభానికి కొక్కేలు తగిలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ మీద పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - farmer died with current shock news
కడప జిల్లా గోపవరం మండలం చెర్లోరామాపురం గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు... విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
farmer died with electric shock
ఎంతసేపటికీ ఇంటికి రాకపోవటంతో కుటుంబీకులు సుబ్బారాయుడి చరవాణికి ఫోన్ చేశారు. సమాధానం రాకపోవటంతో వ్యవసాయ పొలం వద్దకు వచ్చి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడని మృతుని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇంటి పెద్దను కోల్పోవటంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు.